Highest Liplocks | ఒకే సినిమాలో 30 లిప్‌లాక్‌లు – బాలకృష్ణ హీరోయిన్ మూవీ రేర్ రికార్డ్
సినిమాల్లో లిప్‌లాక్‌లు ఉండటం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. కానీ పదమూడేళ్ల క్రితం రిలీజైన ఓ బాలీవుడ్ మూవీలో ఏకంగా 30 లిప్‌లాక్‌లు ఉన్నాయి. హయ్యెస్ట్ లిప్‌లాక్‌లు ఉన్న ఇండియన్ మూవీగా రికార్డ్ నెలకొల్పిన ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Feb 16, 2026, 12.23 pm IST
Highest Liplocks | నేటి సినిమాల్లో లిప్‌లాక్‌లు కామన్‌గా మారిపోయాయి. ప్రేమకథలు, రొమాంటిక్ సినిమాలు అంటే కిస్సింగ్ సీన్లు ఉండాల్సిందే. జెన్‌జీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి లిప్‌లాక్‌లను ప్రచారస్త్రంగా మేకర్స్ వాడుతోన్నారు. టీజర్స్, ట్రైలర్‌లలోనే లిప్‌లాక్‌లను చూపిస్తూ సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్, ఇమ్రాన్ హష్మీ, తెలుగులో విజయ్ దేవరకొండ వంటి హీరోలు లిప్‌లాక్‌లతో ఫేమస్ అయ్యారు.
బాలీవుడ్ మూవీ...
అయితే ఓ సినిమాలో ఒకటో రెండో లిప్‌లాక్‌లు ఉండటం కామన్. అదే యూత్‌ఫుల్ రొమాంటిక్ సినిమాలు అయితే ఇంకాస్త ఎక్కువగా ఐదారు వరకు కిస్సింగ్ సీన్లు ఉంటాయి. కానీ ఓ బాలీవుడ్ మూవీ మాత్రం ఏకంగా ముప్పై లిప్‌లాక్‌లతో తెరకెక్కింది. ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ లిప్‌లాక్‌లు ఉన్న సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఆ సినిమానే త్రీజీ.
హారర్ థ్రిల్లర్ మూవీ...
30 లిప్‌లాక్‌లు అనగానే ఇదేదో బోల్డ్ మూవీ అనుకునేరు. అస్సలు కాదు. హారర్ థ్రిల్లర్ కథతో త్రీజీ మూవీ రూపొందడం గమనార్హం. హారర్ అంశాలతో భయపెట్టడం కంటే లిప్‌లాక్‌లతోనే ఈ సినిమా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. హయ్యెస్ట్ లిప్‌లాక్‌లు ఉన్న ఇండియన్ మూవీ మాదే అంటూ మేకర్స్ కూడా భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ లిప్‌లాక్‌లపై పెట్టిన శ్రద్ధ కథపై పెట్టకపోవడంతో త్రీజీ డిజాస్టర్‌గా నిలిచింది.
సోనాల్ చౌహాన్ హీరోయిన్...
2013లో రిలీజైన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు శ్రీశాంక్ ఆనంద్, శంతను రాయ్ దర్శకత్వం వహించారు. విహారయాత్ర కోసం అడవి మధ్యలో ఉన్న ఓ దీవికి వెళ్లిన జంటకు అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయనే అంశాలతో త్రీజీ మూవీ రూపొందింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీని చాలా వరకు లిప్‌లాక్‌తోనే చూపించారు డైరెక్టర్. కానీ ఈ కిస్సింగ్ సీన్లు మాత్రం సినిమాకు విజయాన్ని అందివ్వలేకపోయాయి.
బాలకృష్ణ సినిమాల్లో...
త్రీజీలో హీరోయిన్‌గా నటించిన సోనాల్ చౌహాన్ తెలుగులోనూ చాలానే సినిమాలు చేసింది. బాలకృష్ణ సినిమాల్లోనే ఎక్కువగా హీరోయిన్ కనిపించింది. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్ కాంబినేషన్‌లో లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాలు వచ్చాయి.
త్రీజీ తర్వాత హయ్యెస్ట్ లిప్‌లాక్‌లు ఉన్న ఇండియన్ మూవీస్ లిస్ట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శుద్ధ్ దేశీ రొమాన్స్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాలో 27 లిప్‌లాక్‌లు ఉన్నాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



