త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు.. హంస వాహనంపై విహరించిన ఆది దంపతులు..!

Srisailam Temple | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన మంగళవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఉదయం యాగశాలలో చండీశ్వరుడికి పూత్యేక పూజలు చేసి, అనంతరం లోక కల్యాణం కాంక్షిస్తూ జపానుస్టాలు, పారాయణాలు నిర్వహించారు.

P

Devotional | Published On Feb 10, 2026, 10.27 pm IST

Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు.. హంస వాహనంపై విహరించిన ఆది దంపతులు..!
Advertisement

Srisailam Temple | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన మంగళవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఉదయం యాగశాలలో చండీశ్వరుడికి పూత్యేక పూజలు చేసి, అనంతరం లోక కల్యాణం కాంక్షిస్తూ జపానుస్టాలు, పారాయణాలు నిర్వహించారు. అలాగే, మండపారాధన, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిపించారు. ప్రదోషకాలంలో జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించారు. ఆ తర్వాత వాహనసేవల్లో భాగంగా స్వామిఅమ్మవార్లను హంసవాహసేన నిర్వహించారు.

అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని వేంచేపు చేసి విశేష పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆదిదంపతులను దర్శించుకున్నారు. ఉత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబయిలో డోల్ తషా, వీరభద్రడోలు కునిత, జాంజ్ పథక్ (కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృతాలు భక్తులను అలరించాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement