త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paytm | పేటీఎం బ్యాంకు లైసెన్సు రద్దు

Paytm | గత నాలుగేళ్లుగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇక పూర్తిగా వినియోగదారులకు దూరం కానున్నది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ రోజు (2026 ఏప్రిల్ 24) ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేసింది.

S

Business | Published On Apr 24, 2026, 7.37 pm IST

Paytm | పేటీఎం బ్యాంకు లైసెన్సు రద్దు
Advertisement

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్బీఐ
నేటి నుంచే అమల్లోకి

Paytm | త్రినేత్ర.న్యూస్ : గత నాలుగేళ్లుగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇక పూర్తిగా వినియోగదారులకు దూరం కానున్నది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ రోజు (2026 ఏప్రిల్ 24) ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పేటీఎం బ్యాంకు ఇక నుంచి ఎటువంటి వ్యాపారం లేదా లావాదేవీలు నిర్వహించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాదారులకు నష్టం వాటిల్లేలా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వ్యవహరించినందువల్ల ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. బ్యాంకు వ్యవహారాలను నిరంతరం పరిశీలించిన ఆర్బీఐ 2022 నుంచే ఆంక్షలు విధించింది. 2022 మార్చి 11 నుంచే కొత్త ఖాతాదారులను చేర్చుకోకూడదని చెప్పింది. 2024 నుంచి డిపాజిట్లను స్వీకరించడం, రుణాలివ్వడం వంటి లావాదేవీలపై నిషేధం విధించింది. ఇప్పుడు పూర్తిగా లైసెన్సును రద్దు చేసింది.

Advertisement
Advertisement