Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ర్యాలీ కొనసాగేనా..?
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడం, గత వారం నమోదైన లాభాల ఊపుతో సూచీలు స్థిరంగా కదలికలు ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 120.03 పాయింట్లు (0.16 శాతం) లాభంతో 74,849.30 వద్ద ప్రారంభమైంది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడం, గత వారం నమోదైన లాభాల ఊపుతో సూచీలు స్థిరంగా కదలికలు ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 120.03 పాయింట్లు (0.16 శాతం) లాభంతో 74,849.30 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.70 పాయింట్లు (0.02 శాతం) పెరిగి 23,150.85 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ అత్యధికంగా లాభపడింది. ఈ సూచీ ఒక శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ కూడా 0.6 శాతం ఎగబాకింది. మరోవైపు నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కెమికల్స్ సూచీలు ఒక శాతం వరకు నష్టపోయాయి.
ఈ వారం ఎలా ఉంటుంది..
గత వారం నిఫ్టీ 2.8 శాతం పెరగడం, ఐటీ రంగ కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థల నుంచి కూడా మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉండడంతో మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 109 డాలర్ల స్థాయికి చేరడం మార్కెట్లకు ప్రధాన ప్రతికూల అంశంగా మారుతుందని పేర్కొన్నారు. పెద్ద కంపెనీల షేర్ల విలువలు ఆకర్షణీయంగా ఉండడం, రూపాయి విలువ బలపడడం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వైఖరిలో కొంత సానుకూల మార్పునకు కారణమయ్యాయని నిపుణులు తెలిపారు. అయితే ముడిచమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగితే ఈ సానుకూల ధోరణి ఎక్కువకాలం నిలవదని అభిప్రాయపడ్డారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లతో పోలిస్తే లార్జ్‌క్యాప్ షేర్ల మెరుగైన పనితీరు కొనసాగుతుందని, రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా వ్యక్తిగత షేర్లలో కదలికలు కనిపించే అవకాశముందని అంచనా వేశారు.
తగ్గిన చమురు ధరలు..
నిఫ్టీకి 22,950 నుంచి 23,000 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతుగా ఉండగా, 23,250 నుంచి 23,300 పాయింట్ల పరిధి కీలక నిరోధ స్థాయిగా ఉంటుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. సాంకేతిక సూచికల్లో ఆర్‌ఎస్‌ఐ 52.81కు బలపడిందని, దాని సగటు 34.70గా ఉందని పేర్కొన్నారు. పుట్-కాల్ నిష్పత్తి (పీసీఆర్) 1.08గా నమోదైందని వెల్లడించారు. కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర దాదాపు రెండు శాతం తగ్గి బ్యారెల్‌కు 107.76 డాలర్ల వద్ద ట్రేడయింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా సుమారు ఒక శాతం క్షీణించి బ్యారెల్‌కు 100.43 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ 0.84 శాతం నష్టపోయింది. హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు 0.83 శాతం వరకు లాభపడ్డాయి. ఇండోనేషియాకు చెందిన జకార్తా కాంపోజిట్ సూచీ మాత్రం ఐదు శాతానికి పైగా పడిపోయింది.
సంబంధిత వార్తలు

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు.. 18 ఏళ్లలో అత్యధిక లాభాల వారం..
అక్టోబర్ 16, 2026

Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..
అక్టోబర్ 16, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●PV Sindhu | వెండి బతుకమ్మతో పీవీ సింధు.. నెటిజన్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్..
- ●Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది వీరే..
- ●Road Accident | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
- ●BHEL | ఐటీఐ అర్హతతో బీహెచ్ఈఎల్లో 660 ఆర్టిసన్ ఉద్యోగాలు
- ●Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?
- ●Conjoined Twins | ఒకే శరీరం.. రెండు తలలతో జన్మించిన బాలుడు.. శ్వాసకోశ సమస్యతో వారం రోజులు పోరాడి..

PV Sindhu | వెండి బతుకమ్మతో పీవీ సింధు.. నెటిజన్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్..

Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది వీరే..

Road Accident | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మంది ప్రయాణికులకు గాయాలు

BHEL | ఐటీఐ అర్హతతో బీహెచ్ఈఎల్లో 660 ఆర్టిసన్ ఉద్యోగాలు



