Crude Oil- LNG Gas Price | చమురు ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు..
Crud Oli- LNG Gas Price | పశ్చిమాసియా ఉద్రిక్తతను ఇంధన మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేశాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఆ తర్వాత ప్రతీకారదాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.
Crude Oil- LNG Gas Price | పశ్చిమాసియా ఉద్రిక్తతను ఇంధన మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేశాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఆ తర్వాత ప్రతీకారదాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందని.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికాలో ఉత్పత్తి అయ్యే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్‌కు దాదాపు 72 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం నుంచి 8శాతం పెరిగింది. పరిస్థితులు మరింత దిగజారితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. అలాగే, ఫ్యూచర్స్‌లో బ్రెంట్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు ఎగిసింది. గతేడాది జనవరి తర్వాత తొలిసారిగా గరిష్ఠానికి చేరుకుంది.
హార్ముజ్ జలసంధి పశ్చిమాసియాలో ఉద్రికత్తల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతోంది. ఈ మార్గం పర్షియల్ గల్ఫ్‌కు ఎంట్రీ గేట్‌లాంటిది. ఈ ఇరుకైన మార్గం గుండా రోజుకు సుమారు 15 మిలియన్ బ్యారల్స్ ముడి చమురు సరఫరా అవుతోంది. ప్రపంచ చుమురు సరఫరాలో దాదాపు 20శాతం. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతాయి.
ఈ మార్గం గుండా వెళ్తున్న రెండు నౌకలపై దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. దాంతో ఆందోళన మరింత పెరిగింది. ఈ జలమార్గం ద్వారా రాకపోకలను ఇరాన్ పరిమితం చేసే అనేక దేశాలకు ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఎనిమిది ఓపెక్ ప్లస్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. ఏప్రిల్ నుంచి రోజుకు అదనంగా 2.06లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ దేశాల జాబితాలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యూఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఉన్నాయి. అయితే, ఎగుమతికి సరైన మార్గం లేకపోతే ఉత్పత్తిని పెంచినా లాభం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఇరాన్ ఎగుమతులు సైతం ప్రమాదంలోనే ఉన్నాయి. ఇరాన్ రోజుకు సుమారుగా 1.6 మిలియన్ బ్యారెల్స్ చమురును ఎగుమతి చేస్తుంది. ఇందులో ఎక్కువ భాగం చైనాకే వెళ్తుంది. ఎగుమతులకు అంతరాయం కలిగితే చైనా వంటి ప్రధాన దిగుమతి దేశాలు ప్రత్యామ్నాయ వనరులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దాంతో ప్రపంచ డిమాండ్, సరఫరా సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పశ్చిమాసియా సంక్షోభం కేవలం చమురు సరఫరాకు మాత్రమే పరిమితం కాదని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం రేటు, స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
యుద్ధం ప్రభావం గ్యాస్ ధరల పెరుగుదలకు దారి తీస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ధం ఆసియా, యూరప్‌లో ఎల్ఎన్‌జీ ధరల పెరుగుదలకు దారి తీయొచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక పేర్కొంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హర్ముజ్ జలసంధి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే గ్యాస్‌లో 20శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ అధికారికంగా ఈ జలసంధిని మూసివేయనప్పటికీ భద్రతా కారణాల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీలు చమురు, గ్యాస్ సరఫరా చేసే నౌకలను నిలిపివేస్తాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. ఈ ప్రాంతంలో కనీసం ఒక డజను ఖాళీ ట్యాంకర్లు రవాణా మార్గాన్ని మార్చుకున్నాయి.
హార్ముజ్ జలసంధి ద్వారా గ్యాస్ ఎగుమతులు ఒక నెల పాటు నిలిపివేస్తే ఆసియాలో ఎల్ఎన్‌జీ ధరలు ఎంఎబీటీయూ 130శాతం పెరిగి 25 డాలర్లకు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఖతార్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఎగుమతిదారుగా ఉంది. ప్రపంచ గ్యాస్ సరఫరాలో 20శాతం వాటా ఈ దేశానికే ఉంది. ఖతార్ అన్ని గ్యాస్ ఎగుమతులు హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగినా ఆసియా మార్కెట్లపై పెను ప్రభావం ఉంటుందని వారెన్ ప్యాటర్సన్ వంటి కమోడిటీలు పేర్కొంటున్నారు. యూఎస్ గ్యాస్ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతున్నా.. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నష్టాలను వెంటనే భర్తీ చేయలేదని పేర్కొంటున్నారు. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడకపోతే గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






