Stock Split | స్టాక్ స్ప్లిట్ ఎఫెక్ట్.. రూ.222 షేర్ ధర రూ.44కి పతనం..
Stock Split | స్మాల్ క్యాప్ విభాగానికి చెందిన లే మెరైట్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ ఇటీవలే స్టాక్ స్ల్పిట్‌కి ఆమోదం తెలపడంతో కంపెనీ షేర్ ధర భారీగా పతనమైంది. క్రితం సెషన్‌లో ఈ షేర్ ధర లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.222.45 వద్ద ముగిసింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.537.85గా ఉంది. 52 వారాల కనిష్ట ధర రూ.222.45గా నమోదైంది.
Stock Split | స్మాల్ క్యాప్ విభాగానికి చెందిన లే మెరైట్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ ఇటీవలే స్టాక్ స్ల్పిట్‌కి ఆమోదం తెలపడంతో కంపెనీ షేర్ ధర భారీగా పతనమైంది. క్రితం సెషన్‌లో ఈ షేర్ ధర లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ.222.45 వద్ద ముగిసింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.537.85గా ఉంది. 52 వారాల కనిష్ట ధర రూ.222.45గా నమోదైంది. అయితే షేర్లకు స్ల్పిట్ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతోనే ఈ షేర్ ధర భారీగా పతనమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్ అయినప్పటికీ షేర్ ధర పడిపోవడం పెట్టుబడిదారులకు నష్టాలను మిగులుస్తుందని చెబుతున్నారు. టెక్ట్సైల్ రంగానికి చెందిన ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైకరెక్టర్స్ ఇటీవలే తమ షేర్ హోల్డర్స్ కోసం 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్‌కి ఆమోదం తెలిపింది. ఇందుకు రికార్డు తేదీని మే 29గా నిర్ణయించారు. అయితే మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ షేర్ ధర బుధవారం నాటి సెషన్‌లో భారీగా పతనమైంది. ఈ కంపెనీ గతేడాది కాలంలో తమ షేర్ హోల్డర్లకు 29 శాతం నష్టాలను మిగిల్చింది. స్టాక్ స్ల్పిట్ ముగిసిన అనంతరం రూ.222.45గా ఉన్న ప్రస్తుత షేర్ ధర రూ.44.49కి పడిపోనుంది.
1 షేర్ 5 షేర్లుగా మార్పు.. పెట్టుబడిదారులకు భారీగా నష్టాలు..
కంపెనీ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొన్న ప్రకారం కంపెనీల చట్టం 2013 సెక్షన్ 61కి అనుగుణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై 1:5 నిష్ఫత్తిలో షేర్లను విభజించేందుకు స్టాక్ స్ప్లిట్‌కు ఆమోదం తెలిపారు. దీని వల్ల రూ.10 ఫేస్ వాల్యూ కలిగిన 1 షేర్ రూ.2 ఫేస్ వాల్యూ కలిగిన 5 షేర్లుగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి అర్హులైన షేర్ హోల్డర్లను ఎంపిక చేసేందుకు మే 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీ తమ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది. అయితే కంపెనీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు తేదీ దగ్గర పడడంతో షేర్ ధర అమాంతం పడిపోయింది. తాజాగా ఒక్క సెషన్‌లోనే 10 శాతం నష్టపోయింది. గత వారం రోజుల్లో ఈ షేర్ ధర సుమారుగా 46 శాతం నష్టాన్ని నమోదు చేయగా, గత నెల రోజుల్లో 51 శాతం పతనమైంది. 6 నెలల్లో 55 శాతం, ఏడాది కాలంలో 29 శాతం నష్టాలను నమోదు చేసింది. గత 5 ఏళ్లలో 201 శాతం లాభాన్ని అందించింది. అయితే ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ.542 కోట్లు ఉండగా, స్టాక్ స్ల్పిట్ అనంతరం షేర్ ధర ఎలా ఉంటుందోనని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Reliance AGM | రిలయన్స్ ఏజీఎం తేదీ ఫిక్స్.. అందరి చూపు జియో ఐపీఓపైనే..
- ●Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో 'బాలభీముడు'
- ●Food | బరువు తగ్గాలని భోజనం మానేస్తున్నారా.. అలా చేయొద్దంటున్న వైద్యులు..
- ●India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి
- ●Ghoshamahal Police | మానవత్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని రక్షించి అప్పగించారు..
- ●CBSE OSM controversy | నేను బాధ్యత వహిస్తున్నా.. సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి

Reliance AGM | రిలయన్స్ ఏజీఎం తేదీ ఫిక్స్.. అందరి చూపు జియో ఐపీఓపైనే..

Gandhi IVF Centre | గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో 'బాలభీముడు'

Food | బరువు తగ్గాలని భోజనం మానేస్తున్నారా.. అలా చేయొద్దంటున్న వైద్యులు..

India Student | కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచి






