త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanagani Dayakar | ప్ర‌జాపాల‌న‌కు కిష‌న్‌రెడ్డి అడ్డుప‌డుతున్న‌రు

Chanagani Dayakar | కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్‌రెడ్డి తెలంగాణ గడ్డపై పుట్టి రాష్ట ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో క‌లిసి కిషన్ రెడ్డి రాజకీయ, ఆర్థిక సంబంధాల్లో భాగంగా ప్రజాపాలనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

S

Telangana | Published On Jun 9, 2026, 3.09 pm IST

Chanagani Dayakar | ప్ర‌జాపాల‌న‌కు కిష‌న్‌రెడ్డి అడ్డుప‌డుతున్న‌రు
Advertisement
  • కేసీఆర్‌తో క‌లిసి రేవంత్‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌రు
  • కిష‌న్‌రెడ్డికి ఇవే చివ‌రి ఎన్నిక‌లు
  • టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చ‌న‌గాని ద‌యాక‌ర్ ఫైర్‌

Chanagani Dayakar | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్‌రెడ్డి తెలంగాణ గడ్డపై పుట్టి రాష్ట ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు ఇవే చివరి ఎన్నికలు అయ్యేటట్లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈమేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కేసీఆర్‌తో క‌లిసి కిషన్ రెడ్డి రాజకీయ, ఆర్థిక సంబంధాల్లో భాగంగా ప్రజాపాలనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర మంత్రిగా ఆయ‌న‌ తెలంగాణ రాష్టానికి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? కిషన్ రెడ్డికి మహారాష్ట ముఖ్యమంత్రితో మాట్లాడే తీరిక లేదా? ఆర్ఆర్ఆర్‌ ప్రాజెక్ట్, తుమ్మిడిహెట్టీ, మెట్రో రైల్‌పై బీజేపీ కేంద్ర మంత్రులకు పట్టనట్లు వ్యవహరించడం సిగ్గు చేటు.

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరితో తెలంగాణ రైతాంగం ఆందోళన చెందుతోంది. తెలంగాణ రాష్ట ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపిస్తే కనీసం రాష్ట అభివృద్ధి గురించి ఆలోచనా చేయ‌డం లేదు. ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించినా కూడా తెలంగాణ బీజేపీ నేతలు పెడ చెవిన పెడుతున్నారు అని ద‌యాక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement