POCSO Case | బాలికపై లైంగిక దాడి.. ఆపై అపార్ట్‌మెంట్ పైనుంచి తోసేసిన నిందితుడు
POCSO Case | ఖమ్మం నగరంలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
POCSO Case | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం నగరంలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన 12 ఏండ్ల బాలికపై ఆ కిరాతకుడు ఈ దారుణానికి ఒడిగట్టగా బాధితురాలు కేకలు వేసింది. దీంతో అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందకు తోసేసి పరారయ్యాడు.
పోలీసుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఓ కుటుంబం కాపలా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 12 ఏండ్ల కుమార్తె ఉంది. ఈనెల 6న (శనివారం) ఎవరూ లేని సమయం చూసి వారి కుమార్తెపై అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆ బాలిక భయపడిన కేకలు వేసింది. అంతటితో ఆగకుండా కిరాతకుడు అపార్ట్‌మెంట్‌పై నుంచి బాలికను కిందకు తోసేయడంతో ఆమె వెన్నెముఖ, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

BRS Report on Dalith Christians | దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా.. బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం
జూన్ 9, 2026

Bakka Judson | ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలు వెల్లడించాలి : బక్క జడ్సన్
జూన్ 8, 2026

Monsoom | తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రకటించిన వాతావరణశాఖ
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Instagram | ఇన్స్టాగ్రామ్ లో భారీ మార్పు.. ఇక మీ ప్రొఫైల్ గ్రిడ్‌ను మీరే రీడిజైన్ చేసుకోవచ్చు..
- ●Nara Lokesh | విశాఖ స్టీల్ ప్రమాదం.. మంత్రి లోకేష్ తీరుపై కార్మిక సంఘాల గుర్రు
- ●SpaceX IPO | ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' ఐపీవో వచ్చేస్తోంది.. భారతీయులు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు?
- ●Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..

Instagram | ఇన్స్టాగ్రామ్ లో భారీ మార్పు.. ఇక మీ ప్రొఫైల్ గ్రిడ్‌ను మీరే రీడిజైన్ చేసుకోవచ్చు..

Nara Lokesh | విశాఖ స్టీల్ ప్రమాదం.. మంత్రి లోకేష్ తీరుపై కార్మిక సంఘాల గుర్రు

SpaceX IPO | ఎలాన్ మస్క్ 'స్పేస్ఎక్స్' ఐపీవో వచ్చేస్తోంది.. భారతీయులు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు?

Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్



