త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ మోహ‌న్‌నాయ‌క్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై రోడ్లు భ‌వ‌నాల శాఖ (R&B) ఇంజినీర్ ఇన్ చీఫ్ జే.మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ (ACB Raids) అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్‌లోని ఆయ‌న నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం తెల్లవారు జాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి.

S

Telangana | Published On Jun 9, 2026, 12.59 pm IST

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ మోహ‌న్‌నాయ‌క్ ఇంట్లో ఏసీబీ సోదాలు
Advertisement
  • త‌న అనుచ‌ర వ‌ర్గంతో క‌లిసి వంద‌ల కోట్ల అవినీతి
  • 11 ప్రాంతాల్లో ఏక‌కాలంలో త‌నిఖీలు

ACB Raids | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై రోడ్లు భ‌వ‌నాల శాఖ (R&B) ఇంజినీర్ ఇన్ చీఫ్ జే.మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ (ACB Raids) అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయ‌న నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం తెల్లవారు జాము నుంచే ఏక కాలంలో దాడులు నిర్వ‌హిస్తున్నారు. కాగా మోహ‌న్ నాయ‌క్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లోనే ఈఎన్సీగా నియ‌మితుల‌య్యారు.

కాంట్రాక్ల‌ర్ల నుంచి క‌మీష‌న్‌..

అయితే మోహన్ నాయక్‌పై ఎప్పటినుండో ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్దమొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమీషన్ వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు స‌మాచారం. ఈయన అవినీతి వ్యవహారాలు తన కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో కలిసి ఏ విధంగా వసూళ్ల దందా నడిపిస్తున్నాడో బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

సారు ప్ర‌స‌న్నం కానిదే ప‌ని జ‌ర‌గ‌దు..

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తన అనుచర వర్గాన్ని ఏర్పరచుకుని వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. స్వయంగా అమాత్యులు ఆదేశాలిచ్చినా.. శాఖలో మోహన్ నాయక్‌ను ప్రసన్నం చేసుకోకుండా పని జరగదనేది డిపార్ట్మెంట్‌లో అంద‌రికీ తెలిసిన విష‌య‌మేన‌ని అంటున్నారు. కాగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అవినీతి దందా నడిపిస్తున్న మోహన్ నాయక్ ఇప్పటికే తరతరాలకు సరిపోయేంత ఆస్తులు కూడబెట్టడనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది.

రోజంతా సోదాలు..

ఈ నేపథ్యంలోనే తాజా ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. సోదాల అనంత‌రం ఆయన అక్రమ సంపాదన ఎంత‌నేది తెలిసే అవ‌కాశాలున్నాయి. భారీగా స్థిర, చరాస్థులు ఉన్నట్లు తెలుస్తోందని.. వాటన్నిటి వివరాలు సేకరించి లెక్కగట్టడానికి చాలా సమయం పట్టే అవకాశముందని సోదాల్లో పాల్గొన్న ఓ అధికారి చెప్పారు. అయితే ఈ రోజంతా సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement