త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త‌గా ఏఐ వాయిస్ సెర్చ్.. ఇక కావ‌ల్సిన విధంగా సినిమాలు, సిరీస్ ల‌ను సెర్చ్ చేయ‌వచ్చు..

Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారుల కోసం కొత్త ఏఐ ఆధారిత వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పటివరకు వాయిస్ ద్వారా కంటెంట్ కోసం సెర్చ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది కేవలం కీవర్డ్స్ ఆధారంగా మాత్రమే ఫలితాలను చూపించేది.

S

Technology | Published On Jun 9, 2026, 3.27 pm IST

Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త‌గా ఏఐ వాయిస్ సెర్చ్.. ఇక కావ‌ల్సిన విధంగా సినిమాలు, సిరీస్ ల‌ను సెర్చ్ చేయ‌వచ్చు..
Advertisement

Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారుల కోసం కొత్త ఏఐ ఆధారిత వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పటివరకు వాయిస్ ద్వారా కంటెంట్ కోసం సెర్చ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది కేవలం కీవర్డ్స్ ఆధారంగా మాత్రమే ఫలితాలను చూపించేది. అయితే కొత్త నేటివ్ ఏఐ వాయిస్ సెర్చ్ టూల్ వినియోగదారుడు అడిగిన ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సందర్భానుసారంగా ఫలితాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉండగా, అమెరికాలోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షించి, లోపాలు లేదా సమస్యలను గుర్తించి అభిప్రాయాలు ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్ కోరుతోంది. అయితే ఈ ఏఐ సెర్చ్ టూల్ స్థిరమైన వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

స‌హ‌జ‌మైన మాట‌ల‌తో సెర్చ్‌..

నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు లేదా సిరీస్‌లను వెతకడానికి ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు కంటెంట్ పేరును టైప్ చేస్తారు. మరికొందరు వాయిస్ డిక్టేషన్‌ను ఉపయోగిస్తారు. అలాగే యాప్‌లో స్క్రోల్ చేయడం లేదా కేటగిరీల ద్వారా కూడా కంటెంట్‌ను వెతుకుతారు. అయితే కొత్త ఏఐ ఆధారిత వాయిస్ సెర్చ్ టూల్‌తో వినియోగదారులు తమకు నచ్చిన భాషలో, సహజమైన మాటలతో కంటెంట్‌ను వెతకవచ్చు. టీవీ షో లేదా సినిమా క‌చ్చితమైన పేరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు నవ్వించే సినిమా కావాలి, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేసుకునే షో కావాలి, భావోద్వేగంగా ఉండే కథ కావాలి వంటి సహజమైన అభ్యర్థనలతో సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ బార్ పక్కన ఉండే ఆస్క్ బటన్‌ను నొక్కి, మీరు చూడాలనుకునే కంటెంట్ రకం గురించి వివరించవచ్చు. అంతేకాకుండా ఐ నీడ్ గుడ్ క్రై, వాచ్ ఇన్ ది బ్యాక్ గ్రౌండ్‌, హెల్ప్ మి స్టే అవేక్ వంటి ముందుగా సిద్ధం చేసిన కొన్ని ప్రాంప్ట్‌లను కూడా ఈ టూల్ సూచిస్తుంది.

బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న‌వారికి..

అయితే ఇది ఇంకా బీటా దశలో ఉన్నందున, ప్రతిసారీ పూర్తిగా క‌చ్చితమైన ఫలితాలు రావడం తప్పనిసరి కాదు. ప్రస్తుతం అమెరికాలోని పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండటంతో, చాలా మందికి ఇది ఇంకా కనిపించడం లేదు. కానీ అతి త్వ‌ర‌లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యూజ‌ర్లందరికీ ఈ టూల్‌ను అందించాల‌ని నెట్‌ఫ్లిక్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారు ఈ ఫీచ‌ర్ ను ప్ర‌స్తుతం ఉప‌యోగించ‌వ‌చ్చు. అందుకు ప‌లు స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో నెట్‌ఫ్లిక్స్ యాప్‌ను ఓపెన్ చేసి అందులో హోమ్ స్క్రీన్‌లోని సెర్చ్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. లేదా ట్రై ఎ న్యూ వే టు సెర్చ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అక్కడ కనిపించే లెర్న్ మోర్ బటన్ పై ట్యాప్ చేయాలి. తరువాత ట్రై నౌ బటన్‌ను ఎంచుకోవాలి. దీంతో నెట్‌ఫ్లిక్స్ కొత్త ఏఐ వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

సెర్చ్ చేయడానికి స‌మ్‌థింగ్ ఫ‌న్నీ అండ్ అప్‌బీట్ వంటి ముందుగా ఇచ్చిన ప్రాంప్ట్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. లేకపోతే మీకు కావాల్సిన కంటెంట్‌ను సహజమైన భాషలో చెప్పి లేదా టైప్ చేసి వెతకవచ్చు. ఈ విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో సరైన సినిమా లేదా సిరీస్‌ను కనుగొనడం మరింత సులభం కానుంది.

Advertisement
Advertisement