త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yogasana Championship | ప్ర‌పంచ యోగాస‌న చాంపియ‌న్‌షిప్‌లో భార‌త్‌కు 102 స్వ‌ర్ణాలు..

Yogasana Championship | తొలిసారిగా నిర్వ‌హించిన ప్ర‌పంచ యోగాస‌న చాంపియ‌న్‌షిప్‌లో (World Yogasana Championship) భార‌త్ స‌త్తా చాటించింది. మొత్తం 114 ప‌త‌కాల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇందులో 102 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.

G

Sports | Published On Jun 9, 2026, 8.33 am IST

Yogasana Championship | ప్ర‌పంచ యోగాస‌న చాంపియ‌న్‌షిప్‌లో భార‌త్‌కు 102 స్వ‌ర్ణాలు..
Advertisement

Yogasana Championship | త్రినేత్ర‌.న్యూస్‌: తొలిసారిగా నిర్వ‌హించిన ప్ర‌పంచ యోగాస‌న చాంపియ‌న్‌షిప్‌లో (World Yogasana Championship) భార‌త్ స‌త్తా చాటించింది. మొత్తం 114 ప‌త‌కాల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇందులో 102 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. సాంప్రదాయ యోగాను ఒలింపిక్స్‌లో ఒక అధికారిక క్రీడ‌గా చేర్చాల‌నే ల‌క్ష్యంతో అహ్మాదాబాద్‌లోని (Ahmedabad) ఎకా అరేనాలో (Eka Arena) ప్ర‌పంచ యోగాస‌న క్రీడా చాంపియ‌న్‌షిప్ నిర్వ‌హించారు. ఈ చారిత్రాత్మ‌క పోటీల‌కు ప్ర‌ధాని మోదీ ఈ నెల 4న వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఇందులో అమెరికా, జపాన్, అర్జెంటీనా, నేపాల్, ఒమన్, కెన్యా స‌హా 79 దేశాలకు చెందిన 522 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. సాంప్రదాయ యోగాసన, ఆర్టిస్టిక్ సింగిల్, ఆర్టిస్టిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూప్, మరియు రిథమిక్ పెయిర్ వంటి విభాగాలలో సబ్ జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు పోటీలు జరిగాయి. ఈ టోర్నీ చిహ్నం వీర్ ది లయన్ (Veer the Lion).

భారత్ అగ్రస్థానం

యోగాకు పుట్టినిల్లు అయిన భార‌త్ ఈ చాంపియ‌న్‌షిప్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. 102 స్వర్ణాల‌తో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 11 ప‌త‌కాల‌తో జపాన్ రెండో ప్లేలో ఉడ‌గా, అర్జెంటీనా (5), సింగపూర్ (7), నేపాల్ (52), ఉజ్బెకిస్తాన్ (25) ప‌త‌కాల‌తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఒలింపిక్స్‌ లక్ష్యంగా..

యోగాసనాలను అంతర్జాతీయ క్రీడా వేదికలపై శాశ్వత స్థానం కల్పించడమే ఈ పోటీల ఉద్దేశం. 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) దీనిని ప్రదర్శన క్రీడగా (Demonstration Sport) చేర్చనున్నారు. అలాగే 2030 ఆసియా క్రీడలు, 2036 ఒలింపిక్ క్రీడల్లో కూడా యోగాసనాలను ఒక అధికారిక క్రీడ‌గా చేర్చాల‌ని భార‌త్ లక్ష్యంగా పెట్టుకుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హ‌క్కుల కోసం భార‌త్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆ క్రీడల్లో యోగాసనాలను ఒక ప్ర‌ధాన పోటీ విభాగంగా చేర్చాల‌ని భావిస్తున్న‌ది.

అదేవిధంగా యోగాను ఒక క్రీడగా మార్చడం ద్వారా యువతీ యువకులు ఈ విభాగంలో అథ్లెట్లుగా, కోచ్‌లుగా, అంపైర్లుగా అంతర్జాతీయ కెరీర్‌ను ఎంచుకునేలా ప్రోత్సహించడంతోపాటు సాంప్రదాయ ఆసనాలు, ఆర్టిస్టిక్, రిథమిక్ వంటి సృజనాత్మక విభాగాలను చేర్చి నేటి తరానికి యోగాపై ఆసక్తిని పెంచ‌డం కూడా ఈ చాంపియ‌న్‌షిప్‌ను నిర్వ‌హించ‌డానికి కార‌ణం.

 

Advertisement
Advertisement