Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
Great Nicobar airport | గ్రేట్ నికోబార్ ఐలాండ్ (GNI) అభివృద్ధి ప్రాజెక్టుపై తీవ్ర వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.13 వేల కోట్ల వ్యయంతో పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే విధంగా గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టు (Great Nicobar airport) నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చింది.
Great Nicobar airport | గ్రేట్ నికోబార్ ఐలాండ్ అభివృద్ధి ప్రాజెక్టుపై (Great Nicobar Island Development Project) తీవ్ర వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ (INS Baaz) నావికాదళ ఎయిర్‌స్టేషన్‌ను విస్తరించే ప్రతిపాదనను భౌగోళిక కారణాలతో విరమించుకున్న ప్రభుత్వం.. దానికి బదులుగా గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.
సుమారు రూ.13 వేల కోట్ల వ్యయంతో పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే విధంగా విమానాశ్రయాన్ని (civil-military airport) నిర్మించనుంది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ఈ ద్వీపంలో రూ.81,000 కోట్ల భారీ అభివృద్ధి ప్రాజెక్టుపై రాజకీయ వివాదం ముదురుతున్న తరుణంలో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం..
పౌర, సైనిక అవసరాలు తీరేలా గలాథియా బే (Galathea Bay) సమీపంలో ఉన్న చింగెన్ (Chingen) వద్ద ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. గ్రేట్ నికోబార్ దీవి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. ఏటా ప్రపంచ వ్యాప్త వాణిజ్య రవాణా, ఇంధన సరఫరాలో సింహభాగం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా చైనాకు అవసరమైన సుమారు 80 శాతం చమురు, 70 శాతం సహజ వాయువు మలక్కా జలసంధి మీదుగానే రవాణా అవుతుండటంతో ఈ ప్రాంతంపై నిఘా పరంగా భారత్‌కు మరింత బలం చేకూరనుంది.
రన్‌వే విస్తరణను పక్కన పెట్టేసిన కేంద్రం..
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ (INS Baaz) నావికాదళ ఎయిర్‌స్టేషన్‌ను విస్తరించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ప్రస్తుతం ఉన్న 4,500 అడుగుల రన్‌వేను దాదాపు 10,000 అడుగులకు పొడిగించడం కష్టతరమని అధ్యయనాలు తేల్చాయి. ఎందుకంటే అక్కడి భూభాగ పరిమితులు, నావిగేషన్ సవాళ్లు, విస్తృతమైన సహాయక మౌలిక సదుపాయాల అవసరం దీనికి అడ్డంకులుగా మారాయి. ముఖ్యంగా ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కంటే ఈ రన్‌వే విస్తరణ వల్ల గిరిజన గూడాలు, అడవులు, వన్యప్రాణుల నివాసాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని అధికారులు నిర్ధారించారు. దీంతో భౌగోళిక పరిమితుల వల్ల ఇప్పటికే ఉన్న ఐఎన్‌ఎస్ బాజ్ ఎయిర్‌స్టేషన్ వద్ద రన్‌వేను విస్తరించేందుకు దీర్ఘకాలికంగా ఉన్న ప్రణాళికను ప్రభుత్వం పక్కనపెట్టాల్సి వచ్చింది. ఇక కొత్త విమానాశ్రయం నిర్మాణం ఐదేళ్లలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
రూ.81వేల కోట్లతో మెగా ప్రాజెక్ట్..
అండమాన్ నికోబార్ ఐలాండ్‌ను ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్రం రూ.81వేల కోట్ల గ్రేట్ నికోబార్ ఐలాండ్ (GNI) డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చింది. ప్రాజెక్టు కింద విమానాశ్రయంతో పాటు పలు కీలక మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.
ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం..
ఈ ప్రాజెక్టుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశ సహజ సంపద, గిరిజన వారసత్వానికి ఈ ప్రాజెక్టు ముప్పుగా మారుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1.5 కోట్ల చెట్లను నరికివేయబోతున్నారని, ఇది ఊహించని పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, గిరిజన ప్రాంతాలకు జరగబోయే నష్టాన్ని వివరిస్తూ ఒక వీడియోను కూడా రాహుల్ ఇటీవలే షేర్ చేశారు. స్థానిక పర్యావరణాన్ని, అక్కడి ప్రజల హక్కులను పక్కనపెట్టి కేవలం వ్యాపార, కార్పొరేట్ ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, సముద్ర వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొంటోంది.
Also Read..
ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్
తాజావార్తలు
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..
- ●Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్
- ●Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..

Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్

Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..



