త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | టైగ‌ర్ సీతారాముడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ఓపెనింగ్ ఈవెంట్‌తో సెన్సేష‌న్ – సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో అనౌన్స్ చేసి ఆగిపోయిన సినిమాల్లో టైగ‌ర్ సీతారాముడు ఒక‌టి. వీర‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీగా ఈ మూవీ లాంఛ్ అయ్యింది. కొద్ది రోజులు షూటింగ్ చేశారు. కానీ జానీ ఫెయిల్యూర్ కార‌ణంగా టైగ‌ర్ సీతారాముడు సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న‌పెట్టారు.

N

Entertainment | Published On Jun 9, 2026, 7.25 pm IST

Pawan Kalyan | టైగ‌ర్ సీతారాముడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ఓపెనింగ్ ఈవెంట్‌తో సెన్సేష‌న్ – సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?
Advertisement

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో రిలీజైన సినిమాలు ఎన్ని ఉన్నాయో ఆగిపోయిన‌వి అన్నే ఉన్నాయి. స‌త్య‌గ్ర‌హి, జీస‌స్ క్రైస్ట్‌, కోబ‌లి ఇలా చాలానే సినిమాలు అనౌన్స్ చేసి అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌క్క‌న పెట్టేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . వాటిలో టైగ‌ర్ సీతారాముడు కూడా ఒక‌టి.

టైగ‌ర్ సీతారాముడు...

వీర శంక‌ర్ రూపొందించిన హ‌లో ఐ ల‌వ్ యూ సినిమా చూసి అత‌డి డైరెక్ష‌న్ శైలికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. ప‌వ‌న్ ఛాన్స్ ఇవ్వ‌డంతో హ్యాపీగా ఫీలైన వీర‌శంక‌ర్ మెగా హీరో ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ఓ ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ సినిమాకు టైగ‌ర్ సీతారాముడు అనే టైటిల్ అనుకున్నారు. శ్రియాను హీరోయిన్‌గా తీసుకున్నారు. నాగ‌బాబు నిర్మాత‌గా టైగ‌ర్ సీతారాముడు భారీగా లాంఛ్ అయ్యింది. ఓపెనింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ దిగ్గ‌జ న‌టులు, ద‌ర్శ‌కులు వ‌చ్చారు. టైగ‌ర్ సీతారాముడు షూటింగ్ కొద్ది రోజుల పాటు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. నెక్స్ట్ షెడ్యూల్‌ను ఫారిన్‌లో షూట్ చేయాల‌ని అనుకున్నారు. అప్ప‌ట్లో ఇదొక హాలీవుడ్ మూవీకి రీమేక్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది.

స్పెష‌ల్ మేకోవ‌ర్‌...

ఈ క్యారెక్ట‌ర్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్పెష‌ల్‌గా మేకోవ‌ర్ అయ్యారు. పొడ‌వైన మీస‌క‌ట్టుతో మాస్ లుక్‌లో క‌నిపించారు. కానీ అదే టైమ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జానీ రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. జానీ ఎఫెక్ట్ టైగ‌ర్ సీతారాముడుపై ప‌డింది. భారీ బ‌డ్జెట్ వెంట‌నే సినిమా అంటే రిస్క్ అనే ఆలోచ‌న‌తో టైగ‌ర్ సీతారాముడు సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆపేశారు.

గుడుంబా శంక‌ర్‌....

టైగ‌ర్ సీతారాముడు స్థానంలోనే వీర‌శంక‌ర్‌తో లిమిటెడ్ బ‌డ్జెట్‌లో గుండుంబా శంక‌ర్ సినిమా చేశారు. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌తో పాటు మ‌ణిశ‌ర్మ పాట‌ల కార‌ణంగా క‌లెక్ష‌న్స్ మాత్రం భారీగానే వ‌చ్చాయి. అలా వీర శంక‌ర్‌తో టైగ‌ర్ సీతారాముడు అనుకొని గుడుంబా శంక‌ర్ సినిమా చేశాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

 

Advertisement
Advertisement